గవర్నర్ తో అచార్య యార్లగడ్డ భేటీ
ప్రతిభకు పట్టం కట్టిన ఉపకులపతుల నియామకన్న వైఎల్పి
రాష్ట్రంలో హిందీ ప్రచారం, సాహిత్య సృజనలను గురించి వివరణ
గవర్నర్ కు అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ, డోనాల్డ్ ట్రంప్ పుస్తకాలు బహుకరణ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ నజీర్ అహ్మద్ ను రాజ్య సభ పూర్వ సభ్యులు, విశ్వ హిందీపరిషత్తు జాతీయ అధ్యక్షులు, పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసారు. గురువారం విజయవాడ రాజ్ భవన్ లో జరిగిన భేటీ సందర్భంగా యార్లగడ్డ తాజాగా రచించిన అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ హిందీ, డోనాల్డ్ ట్రంప్ అంగ్ల పుస్తకాలను గవర్నర్ కు బహుకరించారు. అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ పుస్తకాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అవిష్కరించిన విషయం విదితమే. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకంలో రాష్ట్ర పభుత్వం అనుసరించిన విధానం అభినందనీయమని, కులపతి హోదాలో గవర్నర్ అమలు చేసిన తీరు అందరి ప్రశంసలు అందుకుందని గవర్నర్ నజీర్ అహ్మద్ కు వివరించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిభకు పట్టం కడుతూ ఉఫకులపతుల నియామకం జరిగిందన్నారు. విశ్వవిద్యాలయాను ప్రక్షాళన చేసే దిశగా ప్రతిభకు పట్టం కట్టారని ప్రశంసించారు. వివిధ విశ్వవిద్యలయాలు, ప్రత్యేకించి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నెలకొన్న క్రమ శిక్షణా రాహిత్యంపై దృష్టి సారించాలని యార్లగడ్డ గవర్నర్ కు విన్నవించారు. రాష్ట్రంలో హిందీ ప్రచారం, సాహిత్య సృజనల వికాసాన్ని వివరిస్తూ అలూరు భైరాగి, అచార్య ఆదేశ్వరరావుల కవితలను వైఎల్పి వినిపించారు. ఆంధ్రప్రదేశ్ కు సర్ అర్ధర్ కాటన్ అందించిన సేవలు సైతం వీరి మధ్య చర్చకు వచ్చాయి.