సంభల్ వెళ్లకుండా.. రాహుల్, ప్రియాంక గాంధీ అడ్డగింత
Dec 04, 2024,
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఇటీవల హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు బయల్దేరిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. స్థానికేతరులు అక్కడికి రావడంపై ఆంక్షలున్న నేపథ్యంలో ఘాజీపుర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీల వాహనాలను యూపీ పోలీసులు అడ్డగించారు. దీంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.