ట్రస్ట్ పేరుతో ఫీజులు వసూలు
జాగృతి ఆదర్శ విద్యాలయను వెంటనే సీజ్ చేయాలి..
విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్న జాగృతి ఆదర్శ విద్యాలయం యజమానిపై వెంటనే చర్యలు తీసుకోవాలి..
జై భీమ్ రావ్ భారత్ అనంతపురం జిల్లా యూత్ ప్రెసిడెంట్ చందు నాయక్ డిమాండ్
|| Collection of fees in the name of trust* ||
విలేకరుల సమావేశంలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ అనంతపురం జిల్లా యూత్ ప్రెసిడెంట్ రమావత్ చందు నాయక్ మాట్లాడుతూ….
అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలో గల జాగృతి ఆదర్శ విద్యాలయము ఇది సేవా ట్రస్ట్ పేరు అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారు. ట్రస్ట్ అంటే దాతలు నుంచి డబ్బులు సేకరించి వాటి ద్వారా ఒక ప్రైవేట్ పాఠశాల నిర్మించి విద్యార్థులకు తక్కువ ఫీజులతో విద్యార్థులను చదివిస్తున్నామని. జాగృతి విద్యలయ యజమాన్యం చెబుతున్నారు. కానీ వారు స్కూల్ ఫీజు యూనిఫామ్ ఫీజు బుక్స్ ఫీజు వ్యాన్ ఫీజు అని రకరకాలుగా వారి ఇష్టానుసారం ధరలు నిర్ణయించి ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి జాగృతి ఆదర్శ విద్యాలయ యజమాన్యంపై తగిన చర్యలు తీసుకుని ఉన్నత అధికారులు స్పందించి ఆ పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జాగృతి ఆదర్శ విద్యాలయం విద్యార్థులకు చుట్టుపక్కల పల్లెల నుంచి రవాణా చేయడానికి మూడు టాటా మ్యాజిక్ లో మూడు ఆటోలు సమకూర్చారు ఏ ఒక్క దానికి కూడా రికార్డులు సరిగ్గా లేవు డ్రైవర్లకు లైసెన్సులు లేవు ఒక ఆటోలో 30 మంది విద్యార్థులను గొర్రెలను తోలినట్లు తోలుతున్నారు. పలు విద్యార్థి సంఘాలు ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించడం జరిగింది. విద్యార్థులకు ఏమైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యతలు ఇంత నిర్లక్ష్యంగా దారుణంగా ట్రస్ట్ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు ఇప్పటికైనా ఎంఈఓ గారు స్పందించి స్కూల్ యజమానిపై తగిన చర్యలు తీసుకొని ఆ స్కూల్లో సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షాన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఎంఈఓ ని తెలియజేశారు