బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
క్రైమ్ న్యూస్

నల్లమలలో మళ్లీ కార్చిచ్చు.. విస్తరిస్తున్న మంటలు

నల్లమలలో మళ్లీ కార్చిచ్చు.. విస్తరిస్తున్న మంటలు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: నంద్యాల జిల్లా మహానంది మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. బుధవారం రాత్రి ప్రారంభమైన ఈ అగ్ని ప్రమాదం దయ్యాలతిప్ప, మోకాళ్ల తిప్ప, మోటు ప్రాంతాలకు వ్యాపిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. మంటలు అదుపులోకి రావడం కష్టంగా మారిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపక చర్యలు ప్రారంభించారు. మంటలకు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.అడవి ప్రాంతం ఎత్తైన కొండల మధ్య ఉండటంతో సహాయక చర్యలు సవాలుగా మారాయి. వేసవి కారణంగా చెట్లు, పొదలు పూర్తిగా ఎండిపోవడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. పరిస్థితి అదుపులోకి రాకపోతే వన్యప్రాణులు, జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.స్థానికులు మంటల భయంతో ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో మంటలు మరింతగా వ్యాపిస్తున్నాయని, వన్యప్రాణులు కూడా భయంతో అడవిని విడిచిపెడుతున్నాయని చెబుతున్నారు. ప్రజలకు అటవీశాఖ, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.భూమార్గంలో మంటలను అదుపు చేయడం కష్టంగా ఉండటంతో హెలికాప్టర్ ద్వారా నీటిని చల్లాలని స్థానికులు కోరుతున్నారు. గత నెలలో కూడా ఇదే ప్రాంతంలో కార్చిచ్చు సంభవించిన నేపథ్యంలో, మళ్లీ ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.నల్లమల అడవిలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం పర్యావరణానికి ప్రమాదకరంగా మారింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు యథాశక్తిగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్