బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ

జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ జనసేన పార్టీ చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. సభ నిర్వహణకు అనుమతి కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

హైదరాబాద్‌లో ప్రత్యేక సభ నిర్వహించి తెలంగాణ ప్రజలకు పార్టీ సందేశాన్ని చేరవేయాలని జనసేన భావించినప్పటికీ, పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పార్టీకి అక్కడ కూడా అనుకూల తీర్పు రాలేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సభకు అనుమతి లభించకపోవడంతో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, తెలంగాణ రాజకీయాలపై తమ వైఖరిని మీడియా సమావేశం ద్వారా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సామాజిక మాధ్యమ వేదికలో స్పందించిన పవన్ కళ్యాణ్, సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కనీసం మీడియా సమావేశానికి అయినా అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. “ఏం జరుగుతుందో చూద్దాం” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల మధ్య జనసేన సభ వివాదం రాజకీయ చర్చకు దారితీయగా, హైకోర్టు నిర్ణయంతో పార్టీ తదుపరి అడుగులపై ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో కీలక ప్రకటనలు చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.