బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనకే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం పంట రుణమాఫీ, కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు.

మహిళల సాధికారత కోసం ఉచిత బస్సు ప్రయాణం, తక్కువ ధరకు వంటగ్యాస్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు భారీ స్థాయిలో నియామకాలు చేపట్టామని చెప్పారు.

పేదలకు గృహాలు, కొత్త రేషన్ కార్డులు, విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి సేవల కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, కొత్త నగరాల నిర్మాణం, రవాణా విస్తరణ, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు చేపట్టిన చర్యలను వివరించారు.

తెలంగాణను ఆర్థికంగా మరింత బలోపేతం చేసి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సహకారంతో అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.