Breaking News

రైతులకు గుడ్‌న్యూస్.. వారం రోజుల్లోనే ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమ

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను వారం రోజుల్లోనే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ కూడా త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. రైతులు డబ్బుల కోసం ఎక్కువకాలం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ధరణి పోర్టల్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి భూభారతి అనే కొత్త వ్యవస్థను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. రైతులకు భూమి రికార్డులు సులభంగా అందేలా పారదర్శకతను పెంచుతున్నామని తెలిపారు.రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని, ఇప్పటికే మొదటి విడత విడుదల చేసి, మిగతా మొత్తాన్ని త్వరలో అందజేస్తామని మంత్రి వెల్లడించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవల విస్తరణపై ప్రభుత్వం దృష్టి

జ్యోతిరావు పూలేకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *