బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

‘పెద్ది’ రిలీజ్ మళ్లీ వాయిదా.. నిరాశలో ఫ్యాన్స్

‘పెద్ది’ రిలీజ్ మళ్లీ వాయిదా.. నిరాశలో ఫ్యాన్స్

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా రిలీజ్ ఆలస్యమవుతున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.మొదట ఈ సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. తర్వాత కొన్ని కారణాలతో ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఆ తేదీ కూడా మారిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో సినిమా విడుదలను మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ తెలిపారు.ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. దీంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది షాక్‌గా మారింది.ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూపొందుతున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ రగ్గడ్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ స్టోరీతో ఈ సినిమా ప్రత్యేకంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే విడుదల ఆలస్యం అవుతున్నా, మంచి క్వాలిటీ కోసం సమయం తీసుకుంటున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?