Breaking News

అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం తొండెపి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం బాధితురాలు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.వల్లెపు లక్ష్మయ్య, భూలక్ష్మి దంపతులు సుమారు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని కుటుంబాన్ని స్థాపించారు. ఐదుగురు పిల్లలతో జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో భూలక్ష్మి కుట్టుపనులు, వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి తోడ్పడుతోంది. లక్ష్మయ్య టాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలంగా కుటుంబంలో విభేదాలు పెరుగుతున్నట్లు సమాచారం.భార్యపై అనుమానం పెంచుకున్న లక్ష్మయ్య తరచూ గొడవలకు దిగుతున్నాడు. ఇటీవల భూలక్ష్మి తల్లి కూడా వీరి వద్ద నివసించడం ప్రారంభించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వారం రోజుల క్రితం అత్తకు విషమిచ్చాడన్న ఆరోపణలతో కుటుంబంలో కలహాలు పెరిగినట్లు తెలిసింది.ఈ నేపథ్యంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లక్ష్మయ్య కత్తితో భార్యపై దాడి చేశాడు. ముఖ్యంగా కాళ్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి అరుపులు విని పొరుగువారు అక్కడికి చేరుకుని వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.మొదట సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. కుటుంబ కలహాలు ఇంత దారుణానికి దారి తీసిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *