బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం

సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రుల బృందం ఈరోజు ఉదయం సింగపూర్ చేరుకుంది. మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, బి.సి. జనార్దన్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు.సింగపూర్‌లోని తెలుగు అసోసియేషన్ సభ్యులు మంత్రుల బృందానికి ఘన స్వాగతం పలికారు. పూలదండలతో, సాంప్రదాయ ఆతిథ్యంతో వారిని ఆహ్వానించారు.ఈ బృందం నేటి నుంచి ఏప్రిల్ 27 వరకు మొత్తం ఏడు రోజుల పాటు సింగపూర్‌లో అధికారిక పర్యటన చేయనుంది. ఈ సందర్భంగా అక్కడి ఆధునిక పరిపాలనా విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని అధ్యయనం చేయనున్నారు.అదేవిధంగా, సింగపూర్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్‌తో కలిసి అమలు చేస్తున్న ‘సింగపూర్-ఏపీ జాయింట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వరల్డ్ క్లాస్’ కార్యక్రమం కింద నిర్వహించే ‘ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్’ (ToT) శిక్షణలో మంత్రులు పాల్గొననున్నారు. ఈ శిక్షణలో సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం, ‘నేషన్ ఫస్ట్’ వంటి నాయకత్వ సూత్రాలపై అవగాహన కల్పించనున్నారు.ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో పరిపాలనలో మెరుగులు తీసుకురావడం, అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త దిశను ఇవ్వడం లక్ష్యంగా మంత్రులు ముందుకు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్