బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ ఆ వార్తలను పూర్తిగా ఖండించింది. ప్రస్తుతం ధరల పెంపుపై ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది.ఈ మేరకు కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఇంధన ధరల పెంపుపై వస్తున్న వార్తలు దురుద్దేశపూర్వకమైనవని పేర్కొంది. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మవద్దని సూచించిందిగత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఇంధన ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినా, ఆ ప్రభావం సాధారణ ప్రజలపై పడకుండా చూసుకుంటున్నామని పేర్కొంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కూడా ధరల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించింది.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా ధరలను నియంత్రించడంపై దృష్టి పెట్టినట్లు కేంద్రం తెలిపింది. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.ఎల్పీజీ సరఫరాపై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎక్కడా కొరత లేదని, సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని తెలిపింది. వంటగ్యాస్ కొరతపై వస్తున్న వార్తలు కూడా అసత్యమని వెల్లడించింది.ఇంధన ధరలపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మకుండా, అధికారిక సమాచారం ఆధారంగానే విశ్వసించాలని కేంద్రం ప్రజలకు సూచించింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ