Breaking News

వాసవీ మాత జయంతికి రాష్ట్ర పండుగ హోదా.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక పరంగా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వాసవీ మాత జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల దశమి రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు నిర్వహించనున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ 26న వాసవీ మాత జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వేడుకలను విజయవంతం చేయాలని సూచించింది.ఈ మేరకు ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జారీ చేసిన జీఓ ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఆర్యవైశ్య సమాజం ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధించే వాసవీ మాతను ధర్మం, అహింస, సమానత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఆమె జయంతికి రాష్ట్ర పండుగ హోదా కల్పించడం ద్వారా సమాజ భావోద్వేగాలను గౌరవించినట్టయ్యిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్యవైశ్య సంఘాలు స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలియజేశాయి. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి.. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచన

ఆర్టీసీ సమ్మెపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు.. “ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *