బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పవన్ ఆరోగ్యంపై నిర్లక్ష్యం.. నాగబాబు ఆగ్రహం

పవన్ ఆరోగ్యంపై నిర్లక్ష్యం.. నాగబాబు ఆగ్రహం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై పార్టీ నేతలు నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఎమ్మెల్సీ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని నాగబాబు తెలిపారు. మరో వారం రోజుల్లో ఆయన తిరిగి విధుల్లోకి వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.అయితే సమావేశంలో పలువురు నేతలు పవన్ ఆరోగ్యంపై ప్రశ్నించకుండా స్థానిక రాజకీయ అంశాలు, డిమాండ్లపై చర్చ మొదలుపెట్టడం నాగబాబును అసహనానికి గురిచేసింది. ఫైవ్ మెన్ కమిటీ, కాపు కార్పొరేషన్ వంటి విషయాలు ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు.“పార్టీ అధినేత ఆరోగ్యం గురించి అడగకుండా ఇతర విషయాలపై మాట్లాడటం సరైంది కాదు” అని నాగబాబు తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. నాయకత్వంపై గౌరవం చూపాలని ఆయన సూచించారు.ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన గైర్హాజరీలో పార్టీ కార్యకలాపాల సమన్వయం సవాలుగా మారిన నేపథ్యంలో, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడటం కీలకంగా భావిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్