బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

నాగ్ 100వ చిత్రంలో టబు ఎంట్రీ ఖాయం.. క్లాప్‌బోర్డ్‌తో క్లారిటీ!

నాగ్ 100వ చిత్రంలో టబు ఎంట్రీ ఖాయం.. క్లాప్‌బోర్డ్‌తో క్లారిటీ!

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్ఠాత్మక 100వ చిత్రంపై వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. సీనియర్ నటి టబు ఈ సినిమాలో భాగమవుతున్నట్లు స్వయంగా ప్రకటించారు.తన సోషల్ మీడియా ఖాతా ద్వారా మూవీ క్లాప్‌బోర్డ్ ఫోటోను షేర్ చేసిన టబు, ప్రాజెక్ట్‌లో తన భాగస్వామ్యాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇప్పటివరకు గోప్యంగా కొనసాగుతున్న ఈ సినిమా గురించి మొదటిసారి స్పష్టత రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.ఈ సందర్భంగా దర్శకుడు రా. కార్తీక్ స్పందిస్తూ, “మీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది” అంటూ కామెంట్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాగార్జున–టబు కాంబినేషన్ గతంలో కూడా విజయవంతమైన చిత్రాలను అందించగా, ఇప్పుడు మరోసారి ఈ జోడీ తెరపై కనిపించనుండటం అభిమానులకు మంచి ట్రీట్‌గా మారనుంది.‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. నాగార్జున ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించనున్నారని, పాత్ర కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.ఇక టబు పాత్ర కూడా కథలో కీలక మలుపు తిప్పే విధంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఆమె ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నాగార్జున కెరీర్‌లో మైలురాయి చిత్రంగా నిలవనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?