బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

మీ పేరు భూమి ఆకృతుల్లో కనిపిస్తుందా?.. నాసా వినూత్న టూల్ వైరల్!

మీ పేరు భూమి ఆకృతుల్లో కనిపిస్తుందా?.. నాసా వినూత్న టూల్ వైరల్!

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేస్తూ ముందుండే NASA మరో ఆసక్తికర ప్రయోగంతో ముందుకొచ్చింది. ఎర్త్ డే 2026 సందర్భంగా ‘Your Name in Landsat’ అనే ప్రత్యేక టూల్‌ను పరిచయం చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ టూల్ ద్వారా భూమిపై ఉన్న సహజ భౌగోళిక ఆకృతుల్లోనే మన పేరు కనిపించేలా చేయడం ప్రత్యేకత. వినియోగదారులు తమ పేరు లేదా ఇష్టమైన వారి పేరును ఇంగ్లీషులో టైప్ చేస్తే, ఆ అక్షరాలకు పోలికగా ఉన్న నదులు, పర్వతాలు, అడవులు, పచ్చిక బయళ్లు వంటి భూభాగ చిత్రాలను ఉపగ్రహ డేటా ద్వారా సేకరించి ఒకచోట చూపిస్తుంది.ఈ ప్రయోగం Landsat Program ఆధారంగా రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా పనిచేస్తున్న ల్యాండ్‌శాట్ ఉపగ్రహాలు గత కొన్ని దశాబ్దాలుగా భూమి ఉపరితలాన్ని నిరంతరం చిత్రీకరిస్తూ, పర్యావరణ మార్పులు, వాతావరణ పరిస్థితులు, భూభాగ వినియోగంపై కీలక సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు అదే సాంకేతికతను వినోదాత్మకంగా మార్చి ప్రజలకు చేరువ చేయడమే ఈ టూల్ లక్ష్యం. కేవలం పేరు చూసుకోవడం మాత్రమే కాకుండా, భూమి వైవిధ్యాన్ని కొత్త కోణంలో చూడగలిగే అవకాశం ఇది కల్పిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో ఈ టూల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.సోషల్ మీడియాలో ఈ ఫీచర్ వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా యూజర్లు తమ పేర్లను భూమి ఆకృతుల్లో చూసి వాటిని షేర్ చేస్తుండటం గమనార్హం.విజ్ఞానాన్ని సరదాగా, సులభంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో NASA చేపట్టిన ఈ ప్రయోగం, శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ