బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

హత్య చేసిన వారికి ఆస్తి హక్కు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

హత్య చేసిన వారికి ఆస్తి హక్కు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మే 11, (నేటి తెలుగు పత్రిక): వారసత్వ హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మృతుడి ఆస్తిపై హక్కు ఉండదని స్పష్టం చేసింది. మృతుడు తన వీలునామాలో నిందితుడి పేరును చేర్చినా కూడా ఆస్తి పొందే అర్హత ఉండదని ధర్మాసనం తేల్చి చెప్పింది.జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌ల ధర్మాసనం ఈ కేసును విచారించింది. హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్ 25 ప్రకారం హత్య చేసిన వ్యక్తి లేదా హత్యకు సహకరించిన వ్యక్తి మృతుడి ఆస్తిని పొందే హక్కును కోల్పోతాడని కోర్టు గుర్తుచేసింది.“తప్పు చేసి దాని ద్వారా లాభం పొందడానికి ఎవరినీ అనుమతించకూడదు” అనే న్యాయ సూత్రాన్ని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ నిబంధన అమలుకు తప్పనిసరిగా క్రిమినల్ కోర్టులో శిక్ష పడాల్సిన అవసరం లేదని కూడా కోర్టు పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఆస్తి కోసం జరిగే నేరాలు, కుటుంబ వివాదాల కేసుల్లో ఈ తీర్పు భవిష్యత్తులో మార్గదర్శకంగా నిలిచే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ ఆస్తుల విషయంలో నైతికత, చట్టబద్ధతకు ఈ తీర్పు మరింత బలం చేకూర్చిందని పేర్కొంటున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ