బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

శాంతాక్లాజ్ అవతారంలో అరవింద్ కేజ్రీవాల్

శాంతాక్లాజ్ అవతారంలో అరవింద్ కేజ్రీవాల్

క్రిస్మస్ సందేశం: ఆప్ శాంతాక్లాజ్ అవతారంలో అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దిల్లీ ప్రజలకు వినూత్న శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. శాంతాక్లాజ్ దుస్తుల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు పలు ప్రభుత్వ పథకాలను బహుమతులుగా అందిస్తున్నట్లు వీడియోలో చూపించారు. “దిల్లీ ప్రజల శాంతా కేజ్రీవాల్, ఏడాది పొడవునా బహుమతులు ఇస్తూనే ఉన్నారు” అనే క్యాప్షన్‌తో ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఇది ఏఐ పద్ధతిలో రూపొందించిన వీడియోనా? లేక కేజ్రీవాల్ స్వయంగా శాంతాక్లాజ్ గెటప్ వేసుకున్నారా? అనే వివరాలు వెల్లడించలేదు.

ప్రజల కోసం సంక్షేమ పథకాలు:
దిల్లీ ప్రభుత్వం ప్రజల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉచిత విద్య, వైద్యం, విద్యుత్ పథకాలు ఇప్పటికే ప్రజల చేతిలో ఉన్నాయి. ఇటీవల ఆప్ అధినేత కేజ్రీవాల్ మరోసారి అధికారంలోకి వస్తే కొత్త పథకాలు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ‘మహిళా సమ్మాన్ యోజన’ కింద మహిళలకు నెలకు రూ.2,100 ఆర్థిక సహాయం, సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య సేవలు అందిస్తామన్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఎన్నికల ప్రచారంలో వేడి:
దిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆప్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

  • అరవింద్ కేజ్రీవాల్: న్యూదిల్లీ నియోజకవర్గం
  • ఆతిశీ: కాల్కాజీ
  • సౌరభ్ భరద్వాజ్: గ్రేటర్ కైలాశ్
  • గోపాల్రాయ్: బాబరుర్
  • అమానతుల్లా ఖాన్: ఓఖా
  • సత్యేందర్ జైన్: షాకుర్బస్తీ

ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసిన క్రిస్మస్ వీడియో, వారి సంక్షేమ హామీలు ప్రజలను ఆకర్షించడంలో ఎంత వరకు సఫలమవుతాయో చూడాలి.