బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బీసీ బిల్లు ఆమోదానికి సీఎంల చొరవ అవసరం

బీసీ బిల్లు ఆమోదానికి సీఎంల చొరవ అవసరం

బీసీ బిల్లు ఆమోదానికి సీఎంల చొరవ అవసరం: ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్:
బీసీ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చొరవ చూపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల డిమాండ్లపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.

చంద్రబాబు కీలక పాత్ర:
ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు, బీసీల దీర్ఘకాలిక డిమాండ్ల సాధనకు కృషి చేయాలని, కేంద్రంలో బీసీల హక్కులను అమలు చేయడంలో తమ పాత్రను నిరూపించాలని ఆర్. కృష్ణయ్య కోరారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

బీసీ మహాసభ:
బీసీల డిమాండ్ల సాధనకు జనవరి చివరి వారంలో అమరావతి వేదికగా బీసీ మహాసభ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జ్ నూకాలమ్మ తెలిపారు.

సమావేశం పాల్గొన్నారు:
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకట కోటేశ్వరరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, నేతలు వరప్రసాద్, ఆదిశేషు, మల్లేష్, లక్ష్మణ్, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

వినతులు:
బీసీల ఆర్థిక, విద్య, ఉద్యోగ అవకాశాల పెంపునకు ప్రత్యేక పథకాలు అమలు చేయాలని, బీసీ బిల్లు అనుమతికి తక్షణ చర్యలు చేపట్టాలని సమావేశంలో హాజరైన నాయకులు ప్రభుత్వాలను కోరారు.