బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆకలి కేకలు తో వినిపిస్తున్న తెలంగాణ – కేటీఆర్

ఆకలి కేకలు తో వినిపిస్తున్న తెలంగాణ – కేటీఆర్

కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు: “జాగో తెలంగాణ జాగో” అంటూ పిలుపు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో ఆకలి కేకలు వినిపిస్తున్న పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పాలనను దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఆగ్రహం:

అన్నపూర్ణ తెలంగాణలో బిడ్డలు బువ్వ కోసం ఏడవడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • నా తెలంగాణలో 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నా, పట్టెడన్నం కోసం పసిబిడ్డలు ఆర్తనాదాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
  • కాంగ్రెస్ పాలన వల్ల తెలంగాణలో ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలి కేంద్రాలు నిండిపోయాయని చెప్పారు.
  • కానీ కేసీఆర్ పాలనలో తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా నిలిపామని గుర్తుచేశారు.

విద్యారంగంపై అభివృద్ధి:

  • గతంలో గురుకులాల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటారని, ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించారని చెప్పారు.
  • కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆ విద్యార్థులు గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదిస్తున్నారని విమర్శించారు.
  • ఇది పాలకుల పాపం, విద్యార్థులకు శాపం అని అన్నారు.

కాంగ్రెస్ హామీలపై విమర్శలు:

  • “2024లో మోసం, విధ్వంసం, అల్లర్లు అన్నీ కాంగ్రెస్ పాలనకు 3డీ సారాంశం” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
  • “వాళ్లు 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడతారని, కానీ 2025లో వారిని జవాబుదారులుగా నిలబెడతామని” అన్నారు.

ప్రజలకు పిలుపు:

కేటీఆర్ “జాగో తెలంగాణ జాగో” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

  • కాంగ్రెస్ పాలనను తిప్పి కొట్టాలని, ప్రజల కోసం భవిష్యత్‌ను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

2024 ఎన్నికల ముందు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల తూటాలు మరింత వేడెక్కనున్నాయి. తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో వేచి చూడాల్సిందే.