బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మహిళా శక్తి స్కీమ్…మొబైల్ ఫిష్ వెహికల్స్ అందజేత

మహిళా శక్తి స్కీమ్…మొబైల్ ఫిష్ వెహికల్స్ అందజేత

మహిళా టీచర్స్ డే: సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సీతక్క నివాళులు

హైదరాబాద్: దేశంలో తొలిసారిగా సావిత్రి భాయి పూలే (Savitribai Phule) జయంతిని అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించడం గర్వకారణమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్ (Praja Bhavan) లో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.

“మహిళా టీచర్స్ డే ప్రకటించిన ముఖ్యమంత్రి”
బాలికల విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా టీచర్స్ డేగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. “మేధావి సావిత్రిబాయి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు మార్గదర్శకమవుతుందని,” ఆమె వ్యాఖ్యానించారు.

“మహిళా సాధికారతకై రేవంత్ ప్రభుత్వ కృషి”
గత ప్రభుత్వాలు పట్టించుకోలేని సావిత్రిబాయి పూలే సేవలకు గుర్తింపు ఇచ్చిన దళిత, బడుగు వర్గాలను గౌరవించిన రేవంత్ ప్రభుత్వంగర్వించదగ్గ నిర్ణయాలు తీసుకుంటోందని సీతక్క తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకై కృషి చేస్తున్న తమ ప్రభుత్వం, సామాన్య మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

“ఇందిరా మహిళా శక్తి స్కీమ్: మొబైల్ ఫిష్ వెహికల్స్ అందజేత”
ఇందిరా మహిళా శక్తి స్కీమ్‌లో భాగంగా మొబైల్ చేపల విక్రయ వాహనాలను (Mobile Fish Vehicles) మహిళా సంఘాలకు మంత్రి సీతక్క అందజేశారు. “చేపల విక్రయ వ్యాపారాలకు 100% సక్సెస్ రేట్ సాధించాలి,” అని ఆకాంక్షించారు. “నాణ్యతతో, రుచికరమైన చేపల వంటకాలు తయారుచేసి బ్రాండ్‌ క్రియేట్ చేయండి,” అని సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

“ఆడబిడ్డల చదువుకు మార్గదర్శి”
మహిళలను ఇంటికే పరిమితం చేయాలనే మూఢనమ్మకాలను ధిక్కరించి సావిత్రిబాయి పూలే నిరూపించిన చదువు గొప్పతనం, నేటి మహిళా సాధికారతకు మార్గదర్శకమని సీతక్క వ్యాఖ్యానించారు.

“ఇందిరా మహిళా క్యాంటీన్లు ఆదర్శం కావాలి”
అమ్మ చేతి వంటకు మారుపేరుగా ఇండిరా మహిళా క్యాంటీన్లు అందరికీ ఆదర్శంగా నిలవాలని, ఈ వ్యాపారం గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

“మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం”
మహిళా సంఘాలకు లోన్ భీమా పథకం అమలు చేస్తూ 17 రకాల వ్యాపారాలతో ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. “మహిళలను సాధికారత కలిగించడమే మా ప్రభుత్వ లక్ష్యం,” అని పేర్కొన్నారు.