బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తెలుగు భాషను ప్రేమించండి, ప్రోత్సహించండి

తెలుగు భాషను ప్రేమించండి, ప్రోత్సహించండి

Love and promote Telugu language:

తెలుగు భాషను ప్రేమించండి, ప్రోత్సహించండి: వెంకయ్య నాయుడు

రాజానగరం: తెలుగు రాష్ట్రాల్లో అన్ని కార్యాలు తెలుగులోనే జరగాలని, ఉత్తర్వులు కూడా మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జీజీయూ)లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ప్రసంగించారు.

అమ్మ భాషను మరిచే వారు అమ్మను మరిచినట్లేనని ఆయన తెలిపారు. ‘‘రాష్ట్రం బయట ఉన్న వారు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవాళ్లు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొందరు తెలుగు మాట్లాడడం మానేసినట్లు కనిపిస్తున్నారు’’ అని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

మాతృభాష వాడకం న్యాయస్థానాల్లో పెరగాలని, సినిమాల్లో, పాటల్లో తెలుగుదనం ఉండాలని ఆయన అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ఎన్టీఆర్, నార్ల వెంకటేశ్వరరావు, రామోజీరావు వంటి వ్యక్తులు ఎంతో కృషి చేశారని, ‘‘మన భాషను మనమే కాపాడుకోవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.