Breaking News

KTR attended the ACB investigation

ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్

ఫార్ములా-ఈ రేసు కేసు: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫార్ములా-ఈ రేసు కేసు (Formula E Race Case) విచారణలో భాగంగా తన నందినగర్ నివాసం నుంచి ఏసీబీ (ACB) కార్యాలయానికి చేరుకున్నారు. కేటీఆర్‌తో పాటు ఆయన న్యాయవాది రామచందర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు.

హైకోర్టు అనుమతి, షరతులు
తనతో న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ హైకోర్టును కోరగా, కోర్టు దూరం నుంచి చూసే షరతులతో అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

ఏసీబీ దృష్టి
ఫార్ములా-ఈ రేసు కంపెనీలు ఎఫ్.ఇ.ఓ (FEO), ఏసీఈ నెక్స్ట్ జనరేషన్ (ACE NextGen) మరియు హెచ్‌.ఎమ్‌.డి‌.ఏ (HMDA) మధ్య జరిగిన తొలి త్రైపాక్షిక ఒప్పంద సమయంలో జరిగిన కార్యకలాపాలపై ఏసీబీ దృష్టి సారించింది. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించనున్నారు. అరవింద్ కుమార్ కూడా నేడు విచారణకు హాజరవుతున్నారు.

సాన్నిహిత్యంపై ప్రశ్నలు
ఫార్ములా-ఈ రేసు ఒప్పందాలకు సంబంధించి చలమలశెట్టి అనిల్ మరియు కేటీఆర్ మధ్య ఉన్న సంబంధాలపై కూడా ఏసీబీ వివరణ కోరే అవకాశం ఉంది.

పోలిటికల్ వర్గాల్లో ఆసక్తి
కేటీఆర్ విచారణ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు క్రమంలో ఏసీబీ కేటీఆర్‌ను అరెస్టు చేస్తారా లేదా అన్న అంశంపై చర్చలు సాగుతున్నాయి.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

తాజా పరిణామాలు
కేటీఆర్ ఏసీబీ ఎదుట ఇచ్చే స్టేట్మెంట్, విచారణ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేసులో తదుపరి చర్యలపై అధికార వర్గాలు త్వరలో స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *