బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

గవర్నర్ ఆమోదంతో తెలంగాణలో భూభారతి చట్టం

గవర్నర్ ఆమోదంతో తెలంగాణలో భూభారతి చట్టం

Land India Act in Telangana with Governor's approval

గవర్నర్ ఆమోదంతో తెలంగాణలో భూభారతి చట్టం అమలు దిశగా ముందడుగు

హైదరాబాద్: చారిత్రాత్మక తెలంగాణ భూభారతి చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించిన అనంతరం, వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర అభివృద్ధికి భూభారతి చట్టం:
భూభారతి చట్టం రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. “తెలంగాణ ప్రజలకు మెరుగైన, సమగ్రమైన రెవెన్యూ సేవలను అందించడమే ఈ చట్టం లక్ష్యం. ప్రజల అభిప్రాయాలను సమీకరించి, సామాన్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని రూపొందించాం,” అని ఆయన తెలిపారు.

రెవెన్యూ వ్యవస్థలో మార్పులు:
రెవెన్యూ వ్యవస్థను గ్రామస్థాయికి చేర్చే దిశగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నాయని మంత్రి తెలిపారు. “రెవెన్యూ చట్టం-2020 కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. తెలంగాణలో భూ సమస్యలేని గ్రామం లేదు. గత ప్రభుత్వం తమ ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా దిగజార్చింది,” అని మంత్రి మండిపడ్డారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రతీ గ్రామానికి రెవెన్యూ అధికారి నియామకం:
గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలను పటిష్ఠం చేయడానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ప్రకటించారు. “సమిష్టి కృషితో రెవెన్యూ శాఖను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేలా తీర్చిదిద్దుతాం,” అని మంత్రి హామీ ఇచ్చారు.

భూభారతి బిల్లును అందజేత:
గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు ప్రతిని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. రెవెన్యూ శాఖను ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు చేపట్టాం,” అని తెలిపారు.

సామాన్యుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం:
తెలంగాణ ప్రజలు భూ సమస్యల నుంచి విముక్తి పొందేలా భూభారతి చట్టం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పొంగులేటి విశ్వాసం వ్యక్తం చేశారు. “ప్రజలు సంతోషించేలా రెవెన్యూ శాఖ సమిష్టిగా పనిచేయాలి,” అని ఆయన సూచించారు.