బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

కోట్లాది హిందువుల ఆరాధ్యస్థలానికి మచ్చ – వైఎస్ షర్మిల

కోట్లాది హిందువుల ఆరాధ్యస్థలానికి మచ్చ – వైఎస్ షర్మిల

Jagan has lost credibility: Sharmila

తిరుపతి: తిరుమలలో తొక్కిసలాట – వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

తిరుపతి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ నిలుచున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కోట్లాది హిందువుల ఆరాధ్యస్థలానికి మచ్చ:
లడ్డు కల్తీ తర్వాత నేడు తొక్కిసలాట జరిగిన విషయం బాధాకరమని, ఇది కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పరిపాలనపై మచ్చ వేసిందని ఆమె ఆరోపించారు. “వైకుంఠ దర్శనం కోసం భక్తులు తిరుపతికి వస్తే, వారిని వైకుంఠానికే పంపడం దురదృష్టకరం” అని ట్విటర్ ద్వారా వ్యాఖ్యానించారు.

పాలన వైఫల్యంపై విమర్శలు:
“లక్షలాది మంది భక్తులు వస్తారని ముందే తెలిసి ఉండీ కనీస ఏర్పాట్లు చేయకపోవడం, ఘోర మృత్యుఘోష వినిపించడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనం,” అని షర్మిల మండిపడ్డారు. “గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట, భక్తుల ఆర్తనాదాలు వినిపించడం బాధాకరం,” అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

డిమాండ్లు:
తొక్కిసలాట ఘటనపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించి బాధ్యత నుంచి తప్పుకోవడం అన్యాయం,” అని షర్మిల పేర్కొన్నారు.
ఆ సంఘటనలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ. కోటి పరిహారం ప్రకటించడంతోపాటు, వారి కుటుంబంలో అర్హులైన ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

పరిపాలనా వ్యవస్థపై ప్రశ్నలు:
తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్ షర్మిల విమర్శించారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.