Breaking News

Dil Raju's reaction to IT attacks

ఐటీ దాడులపై దిల్ రాజు స్పందన

ఐటీ దాడులపై దిల్ రాజు స్పందన: అన్ని వివరాలు ఐటీ అధికారులకు అందించినట్లు పేర్కొన్నారు

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత మరియు టీఎఫ్ఏసీ చైర్మన్ దిల్ రాజు శనివారం హైదరాబాదులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల తనపై జరిగిన ఐటీ దాడుల గురించి స్పందించారు. ఐటీ అధికారులు తమతో గత రోజు మాట్లాడారని, వారు అడిగిన అన్ని వివరాలు ఇచ్చినట్లు తెలిపారు.

నమ్మకంతో సమాధానాలు
దిల్ రాజు, ఐదు సంవత్సరాలుగా తమ సంస్థ ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదని, అలాంటి ఏ లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు. ఐటీ అధికారులు సినిమా సంబంధిత లావాదేవీలు, అకౌంట్స్ బుక్స్ మరియు స్టేట్మెంట్ని చెక్ చేయగా, బ్లాక్ మనీ అనే సమస్య లేదని చెప్పారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

క్యాష్ వివరాలు
దిల్ రాజు మాట్లాడుతూ, తన దగ్గర రూ.5 లక్షలు, శీరిష్ దగ్గర రూ.4.50 లక్షలు, తన కుతురు ఇంట్లో రూ.6 లక్షలు, ఆఫీసులో రూ.2.50 లక్షలు ఉన్నాయని, మొత్తం 20 లక్షల కంటే తక్కువ క్యాష్ రూపంలో ఉందని వివరించారు.

కుటుంబ ఆరోగ్యం
ఆయన లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల తల్లిను హాస్పిటల్ కు పంపించారని, ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నారు అని తెలిపారు.

మీడియా పై అభ్యంతరం
తాము తప్పు వార్తలు రాసే పని చేయవద్దని మీడియాను కోరారు. తమపై టార్గెట్ చేయడంలేదని, ఐటీ దాడులు సాధారణమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. “ఇవి నా ఒక్కడిపైనే జరగలేదు. 18 సంవత్సరాల తర్వాత మా ఇళ్లలో సోదాలు జరిపారు” అని అన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *