బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కిషన్ రెడ్డికి చురకలేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కిషన్ రెడ్డికి చురకలేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Chamala Kiran Kumar Reddy is the MP who has succeeded Kishan Reddy

దావోస్ పెట్టుబడులపై కిషన్ రెడ్డికి చురకలేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

భువనగిరి: దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంపై జరిగిన చర్చ రాజకీయం రగులుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పెట్టుబడుల ప్రణాళికలను బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించడంపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

కిషన్ రెడ్డిపై విమర్శలు:
గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన చామల కిరణ్ కుమార్ రెడ్డి, “కిషన్ రెడ్డి గులాబీ కళ్లజోడు తీసి చూస్తే అన్ని సజావుగా కనిపిస్తాయి. ఆయన మోడీ క్యాబినెట్లో మంత్రా? లేక కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పాలేరువా?” అంటూ ఎద్దేవా చేశారు.

పెట్టుబడులపై అవహేళన:
దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు తీసుకురావడం ఒక గొప్ప విజయం అని, కానీ కిషన్ రెడ్డి అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చామల విమర్శించారు. “మరి మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా దావోస్ వెళ్లారని ఎవర్నైనా నిలదీయాలంటే ముందు వారిని ప్రశ్నించాలి,” అని సూచించారు.

బీజేపీ-బీఆర్ఎస్ మధ్య కలయిక?:
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడంలో నిమగ్నమయ్యాయని చామల ఆరోపించారు. “తెలంగాణ బిడ్డలకు ఉపాధి కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం. మరి తెలంగాణ ప్రజల అభివృద్ధికి చేసిన పనులను అంగీకరించాలి, అబద్దాలు మానుకోవాలి,” అని హితవు పలికారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈటెల దాడి, ఇతర ప్రశ్నలు:
బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రియల్టర్లపై దాడి అంశంపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన చామల, “మీరు ఈటెల దాడిని సమర్థిస్తున్నారా?” అంటూ కిషన్ రెడ్డిని నిలదీశారు.

సహకారం అవసరం:
“మీరు రాష్ట్రానికి మంచి చేసే పాత్ర పోషించాలి. దుష్ప్రచారం మానేసి, అభివృద్ధి కోసం సహకరించాలి. మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు గౌరవిస్తారు,” అని చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు.

దావోస్ పెట్టుబడుల చర్చ తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురానుందనేది స్పష్టంగా కనిపిస్తోంది.