బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అటవీ భూముల కబ్జా వివాదంపై ఏపీ ప్రభుత్వ సీరియస్

అటవీ భూముల కబ్జా వివాదంపై ఏపీ ప్రభుత్వ సీరియస్

పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జా వివాదంపై ఏపీ ప్రభుత్వ సీరియస్ చర్యలు

మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జా వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.

పెద్దిరెడ్డి భూ ఆక్రమణ ఆరోపణలు

🔹 చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందన్న ఆరోపణలు ఇటీవల తెరపైకి వచ్చాయి.
🔹 ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ బుధవారం అటవీ శాఖ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
🔹 అటవీ భూముల ఆక్రమణలు, అడవుల ధ్వంసంపై తక్షణమే విచారణ చేపట్టాలని, పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా పీసీపీఎఫ్‌కు (Principal Chief Conservator of Forests – PCCF) ఆదేశాలు జారీ చేశారు.

సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

🔸 పెద్దిరెడ్డి భూ ఆక్రమణ ఆరోపణలపై రెవెన్యూ శాఖ ఇప్పటికే ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది.
🔸 పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో కూడా బినామీ పేర్లతో వందల ఎకరాల భూములు అక్రమంగా ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
🔸 ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
🔸 పెద్దిరెడ్డి భూమా ఫియాపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ప్రభుత్వం పెద్దిరెడ్డిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి!