బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

“చేసిన మంచి పనులే మనతో ఉంటాయి” – నారా భువనేశ్వరి

“చేసిన మంచి పనులే మనతో ఉంటాయి” – నారా భువనేశ్వరి

“చేసిన మంచి పనులే మనతో ఉంటాయి” – నారా భువనేశ్వరి

విజయవాడ: ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి విజయవాడలో నిర్వహించనున్న యుఫోరియా కార్యక్రమం గురించి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టికెట్లు కొనుగోలు చేసి మాత్రమే లోనికి అనుమతి ఉంటుంది అని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ఆయన వెంట వచ్చే పీఏలు, భద్రతా సిబ్బందికి కూడా టికెట్ కొనుగోలు చేయాల్సిందే అని చెప్పారు.

చంద్రబాబు కుటుంబ సభ్యులు టికెట్లు కొనుగోలు

ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించే మ్యూజికల్ నైట్ కి సంబంధించిన వివరాలను ఇచ్చిన నారా భువనేశ్వరి, “తమ కుటుంబ సభ్యులకు రూ.6 లక్షలు వెచ్చించి చంద్రబాబే టికెట్లు కొని టేబుల్ బుక్ చేసుకున్నారు” అని తెలిపారు. “ఎన్టీఆర్ ట్రస్టు కోసం ఏదైనా చేస్తాం అంటే చంద్రబాబు అంత తేలిగ్గా ఒప్పుకోరని” చెప్పిన ఆమె, “వివిధ కార్యక్రమాల గురించి ఆయన్ను అడగలేదు, ఎందుకంటే ఆయన వెంటనే అంగీకరించరు” అని వెల్లడించారు.

పవన్ కల్యాణ్ ఆహ్వానం

“మ్యూజికల్ నైట్ ఈవెంట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించాం” అని నారా భువనేశ్వరి చెప్పారు. “పవన్ కల్యాణ్ తప్పకుండా ఈ కార్యక్రమానికి వస్తారని” ఆమె ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సమాజం సేవ – ఎన్టీఆర్ స్ఫూర్తి

“సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అని ఎన్టీఆర్ నమ్మిన విలువలు అందరికి చేరవేసేలా నారా భువనేశ్వరి తెలిపారు. “ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ట్రస్టు ఏర్పాటు చేశాం” అని పేర్కొన్న ఆమె, “రక్తదానం వంటి కార్యక్రమాలు మరెంతో మందికి జీవితాన్ని బతికించడంలో సహాయపడతాయి” అని తెలిపారు.

సేవా కార్యక్రమాలపై దృష్టి

“ఫండ్ రైజింగ్ కోసం మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నాం” అని చెప్పిన నారా భువనేశ్వరి, “మనలో సర్వే సాయం చేసే దృష్టికోణం ఉండాలి. మనం చేసిన మంచి పనులే మనతో ఉంటాయి” అని వాఖ్యానించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె సూచించారు.