బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు..బీసీ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి?

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు..బీసీ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి?

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు – రేవంత్ భేటీలు, బీసీ డిప్యూటీ సీఎంపై ఆసక్తికర చర్చ

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో నూతన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీలు రాజకీయ ఉత్కంఠ రేపుతుండగా, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) త్వరితగతిన స్పందించి, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. “ఏ సమస్య ఉన్నా నేరుగా తన వద్దకే రావాలి, గీత దాటొద్దు” అంటూ వారికి క్లారిటీ ఇచ్చారు.

ఢిల్లీ పర్యటన – కేబినెట్ విస్తరణపై చర్చ

ఇంతలోనే సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, పీసీసీ కార్యవర్గ ఏర్పాటు వంటి కీలక అంశాలపై హైకమాండ్‌తో చర్చించనున్నారు.

బీసీ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి?

తెలంగాణలో బీసీ వర్గానికి ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో, కాంగ్రెస్ కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్ పదవిని బీసీ వర్గానికి కేటాయించగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని కూడా బీసీ వర్గానికి ఇవ్వాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

పోటీ పెరుగుతున్న బీసీ రాజకీయం

తెలంగాణలో బీసీ వర్గం ప్రధాన రాజకీయ కేంద్రంగా మారుతోంది. బీజేపీ కూడా “బీసీ సీఎం” నినాదంతో ముందుకు వస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బీసీ వర్గానికి చెందిన వారికే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా బీసీలను ఆకర్షించేందుకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని యోచిస్తోంది.

ముదిరాజ్ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి?

డిప్యూటీ సీఎం పదవిని బీసీ వర్గానికి కేటాయిస్తే, ముదిరాజ్ సామాజిక వర్గానికి దక్కే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మంత్రివర్గ విస్తరణ – పీసీసీ కొత్త కార్యవర్గంపై స్పష్టత

రేవంత్ హైకమాండ్‌తో మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుపుతుండగా, కొత్తగా మంత్రులుగా ఎవరు బాధ్యతలు స్వీకరించబోతున్నారనే అంశంపై దాదాపు స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పీసీసీ కొత్త కార్యవర్గం కూడా ఖరారైనట్లు సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికలపై త్వరలో నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఈ వారంలోనే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

రెవంత్ చర్చలు – కీలక నిర్ణయాలకు వేదిక

సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో, కాంగ్రెస్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు ఉంటాయని పార్టీలో చర్చ నడుస్తోంది.