బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

డిజిటల్ దశలో ముందుకు తెలుగు రాష్ట్రం – సీఎం చంద్రబాబు

“డబ్బు కాదు.. డేటా ముఖ్యం!” – సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

📍 గుంటూరు: “మన దగ్గర ఎంత డబ్బు ఉందో కాదు.. ఎంత డేటా ఉందో అదే ముఖ్యమైనది” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు మంగళదాస్ నగర్‌లోని ప్రైవేట్ వైద్యశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, వైద్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

🔹 సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు ఐటీ చదవాలని 1995లోనే చెప్పాను. అందుకు ఫలితంగా నేడు మన రాష్ట్రం ఐటీ రంగంలో ముందున్నది” అని అన్నారు.
🔹 1995లో ఐటీ గురించి మాట్లాడానని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి చెబుతున్నా” అని చంద్రబాబు పేర్కొన్నారు.
🔹 భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏఐ (AI) శాసించబోతోంది అని ఆయన అభిప్రాయపడ్డారు.
🔹 రాష్ట్రంలో ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతున్నాయని, త్వరలో ప్రైవేట్ సేవలను కూడా ఈ విధానంతో అనుసంధానం చేస్తామని సీఎం తెలిపారు.

✅ సీఎం చంద్రబాబు వైద్య రంగ అభివృద్ధి, ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
“గతంలో గుండె ఆపరేషన్‌ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లారు. నా అత్తగారు క్యాన్సర్‌తో మృతి చెందారు. ఆ బాధను అర్థం చేసుకుని క్యాన్సర్ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఎన్టీఆర్ బసవతారకం ఆసుపత్రిని నెలకొల్పారు” అని గుర్తుచేశారు.
✅ గుంటూరులో ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర ఆసుపత్రి వైద్య సేవలను అభినందిస్తూ, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్