Breaking News

I knew my defeat six months before - Ex-Minister Errabelli

నా ఓటమి ఆరు నెలల ముందే తెలుసు – మాజీ మంత్రి

కేసీఆర్ ప్రోత్సాహంతోనే పోటీ చేశాను – మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

📍 మహబూబాబాద్, ఫిబ్రవరి 16: శాసనసభ ఎన్నికల్లో తన ఓటమి ఆరు నెలల ముందే తెలుసని, కానీ కేసీఆర్ ప్రోత్సాహంతోనే పోటీ చేశానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట లో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేళ్లు దార్శనికతతో పాలించారని, అయితే 15 నెలల కాంగ్రెసు పాలనలోనే అన్ని రంగాల్లో దివాలా తీయించారని విమర్శించారు.

గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. పొంగులేటిపై మైనింగ్ ఆరోపణల ఫిర్యాదు

📌 కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు

🔹 ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నారన్నారు.
🔹 కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదని స్పష్టం చేశారు.
🔹 ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌కు 100 సీట్లు ఖాయమన్నారు.

📌 సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు

🔸 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపించారు.
🔸 రాహుల్ గాంధీ (Rahul Gandhi) గత ఆరు నెలలుగా సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు.
🔸 వరంగల్ పర్యటన రద్దు చేయించేందుకు సీఎం రేవంత్ రాహుల్ గాంధీని కలిసి మాట్లాడారని ఆరోపించారు.
🔸 రాష్ట్రంలో సీఎం సోదరులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఎర్రబెల్లి తీవ్ర ఆరోపణలు చేశారు.

కల్తీ ఆహారంపై యుద్ధం.. ప్రత్యేక వ్యవస్థతో కఠిన చర్యలు: సీఎం రేవంత్

🔹 “కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. రాబోయే రోజుల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారు,” అని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. 🚩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *