బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

“రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు.. బీజేపీకి ఆయన ఎదుగుదల భయంగా మారింది” – అద్దంకి దయాకర్

“రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు.. బీజేపీకి ఆయన ఎదుగుదల భయంగా మారింది” – అద్దంకి దయాకర్

"Rahul Gandhi is a Brahmin...His rise has become a fear for BJP" - Adnaki Dayakar

|| “Rahul Gandhi is a Brahmin…His rise has become a fear for BJP” – Adnaki Dayakar ||

📍 హైదరాబాద్: రాహుల్ గాంధీ (Rahul Gandhi) కులం, మతం గురించి బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఘాటు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నాయకులు కులమత రాజకీయాలు చేసే వారని, రాహుల్ గాంధీ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అని స్పష్టం చేశారు.

“బీజేపీకి రాహుల్ గాంధీ ఎదుగుదల భయంగా మారింది”

👉 “రాహుల్ గాంధీ ‘పండిత్’ అనే బ్రాహ్మణ కులానికి చెందిన వారు. కానీ, మీకు ఆయన కులం తెలియకపోవడం దౌర్భాగ్యం” అని దయాకర్ ఎద్దేవా చేశారు.
👉 “బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం వారి అసహనానికి నిదర్శనం. ఆయన కాబోయే ప్రధాని అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయనను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆరోపించారు.
👉 “రాహుల్ గాంధీ దేశ రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నారు. పేదల తరఫున నిలబడి, బీజేపీ పాలనలో వారి హక్కులను కాపాడుతున్నారు. అందుకే మోడీకి, బీజేపీ నేతలకు ఆయన ఎదుగుదల భయంగా మారింది” అని వ్యాఖ్యానించారు.

“మోడీ కన్వర్టెడ్ బీసీ.. అసలు బీసీ కాదు”

📌 “ప్రధాని మోడీ పుట్టుకతో బీసీ కాదు. ఆయన తన కులాన్ని బీసీ జాబితాలో చేర్చించుకున్నారు” అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను దయాకర్ గుర్తు చేశారు.
📌 “రాహుల్ గాంధీ మీద బీజేపీ నాయకులు అనవసరంగా వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు.
📌 “రాహుల్ గాంధీని కించపరిచే బీజేపీకి సంస్కృతి, విలువలు లేవు. ప్రజలందరికీ అర్థమయ్యేలా రాహుల్ గాంధీ నిజమైన నాయకుడిగా ఎదుగుతున్నారు” అని దయాకర్ తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

📢 రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.