బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేసు వాదన మధ్య న్యాయవాదికి గుండెపోటు

కేసు వాదన మధ్య న్యాయవాదికి గుండెపోటు

A lawyer has a heart attack in the middle of arguing a case

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది పసునూరి వేణుగోపాల్ (Pasunoori Venugopal) గుండెపోటుతో మృతి చెందారు. కోర్టు గదిలో తన క్లయింట్ తరపున వాదనలు వినిపిస్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.

ఫిబ్రవరి 18న ఓ కేసుకు సంబంధించి పసునూరి వేణుగోపాల్ కోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలో హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కోర్టు సిబ్బంది, తోటి న్యాయవాదులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆయనను పరీక్షించి అప్పటికే మరణించారని నిర్ధారించారు.

వేణుగోపాల్ అకాల మరణం న్యాయవాద వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కోర్టు ప్రాంగణంలోనే తన చివరి శ్వాస విడవడం, న్యాయవాదుల మధ్య విషాదం నింపింది. తోటి న్యాయవాదులు ఆయన మృతిపై సంతాపం ప్రకటించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇటీవల యువత నుంచి వృద్ధుల వరకు గుండెపోటు కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు ఎమర్జెన్సీ చికిత్స ద్వారా ప్రాణాలను దక్కించుకుంటుండగా, మరికొందరు తుది శ్వాస విడుస్తున్నారు. విద్య, ఉద్యోగ, న్యాయ రంగాల్లో పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవన శైలి మార్పులు గుండె సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు వైద్య నిపుణులు.

న్యాయ రంగానికి ఆయన అందించిన సేవలు మరవలేనివని, న్యాయవాద వృత్తిలో ఆయన అభిప్రాయాలు, న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.