బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విడదల రజినికి ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట

విడదల రజినికి ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట

Temporary relief in AP High Court for vidadala Rajini

|| Temporary relief in AP High Court for vidadala Rajini ||

అమరావతి: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం జరిగిన విచారణలో రజినితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులపై కఠిన చర్యలు తీసుకోవద్దని చిలకలూరిపేట పోలీసులకు కోర్టు స్పష్టం చేసింది. అలాగే తదుపరి విచారణను ఫిబ్రవరి 20కు వాయిదా వేసింది.

ఏం జరిగింది?

సోషల్ మీడియాలో ఐటీడీపీకి సంబంధించిన పోస్టుల వ్యవహారంలో చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించారు. 2019లో అప్పటి పట్టణ సీఐ సూర్యనారాయణ తనను అక్రమంగా అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టకుండా వేధించారని కోటి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

విడదల రజిని ఆదేశాల మేరకే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా కులం పేరుతో దూషించారని కోటి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని ఆయన కోర్టుకు తెలియజేశారు.

హైకోర్టు ఆదేశాలు

ఈ నేపథ్యంలో హైకోర్టు విడదల రజిని, ఆమె పీఏలు రామకృష్ణ, ఫణి, అలాగే అప్పటి సీఐ సూర్యనారాయణలపై కేసు నమోదు చేయాలని ఇటీవల పోలీసులను ఆదేశించింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్
  • పల్నాడు జిల్లా పోలీసులకు రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి దర్యాప్తు వివరాలు సమర్పించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
  • పోలీసుల ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్

తన అరెస్ట్‌కి అవకాశం ఉందని భావించిన విడదల రజిని, ఆమె పీఏలు రామకృష్ణ, ఫణి ఫిబ్రవరి 10న హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరారు.

  • పిటిషనర్ పై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నట్లు కోర్టుకు రజిని వివరించారు.
  • తనపై ఒత్తిడి తీసుకొచ్చి రాజీ కుదుర్చుకునేందుకు కోటి తప్పుడు ఫిర్యాదు చేశారని రజిని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

తాత్కాలిక ఊరట

ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసిన హైకోర్టు, ఆ సమయంలో వరకు రజిని, ఆమె సహాయకులపై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే పోలీసుల విచారణలో ఉన్న ఈ కేసు, ఫిబ్రవరి 20న మరింత కీలక మలుపు తిరగనుంది.