బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల వినూత్న నిరసన

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల వినూత్న నిరసన

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల వినూత్న నిరసన

న్యూ ఢిల్లీ:

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో, ఆయనపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరపాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. గత కొన్నిరోజులుగా పార్లమెంటు లోపల, బయట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం కూడా విపక్ష ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ చిత్రాలతో పాటు “మోదీ-అదానీ భాయ్ భాయ్” నినాదాలు ముద్రించిన బ్యాగులను పట్టుకొని పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ప్రియాంక చేతిలోని బ్యాగ్‌ను పరిశీలించండి, ఎంత ప్రత్యేకంగా ఉందో! బ్యాగ్‌పై ఒకవైపు మోదీ, మరోవైపు అదానీ బొమ్మలతో పాటు ‘మోదీ అదానీ భాయ్ భాయ్’ అని రాసి ఉంది” అన్నారు.

ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, “మేం సభా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం చర్చను కోరుకోవడం లేదు. ఏదో ఒక సాకుతో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తోంది,” అంటూ విమర్శించారు.

విపక్షాల నిరసనలు మరింత ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ వివాదం పరిష్కారానికి ప్రభుత్వం ఏమేరకు స్పందిస్తుందో చూడాలి.