Breaking News

లీ ఫార్మా, లీ హెల్త్ డొమైన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…!

విశాఖపట్నం: ఫిబ్రవరి 18 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్రతి ఒక్కరు ఎముకల పటిష్టతపై శ్రద్ద వహించా లని, ఆరోగ్యంగా ఉండే విధంగా శరీరానికి కావా లసిన పోషకాలు తప్పని సరిగా తీసుకోవాలని లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి అన్నారు. ఈ సందర్భంగా లీ ఫార్మా, లీ హెల్త్ డొమైన్ సంయుక్తం గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌తో కలిసి బుధవారం మాల్ ఉద్యోగు ల కోసం ఉచిత ఎముకలు కీళ్ల ఆరోగ్య వైద్య శిబిరా న్ని నిర్వహించాయి. ఈ వైద్య శిబిరం ద్వారా సుమారు 300 మంది లబ్ధి పొందారు. వీరికి హ్యాండ్ గ్రిప్, బిఎమ్ఐ, హెచ్.బి, ఆర్.బి.ఎస్, బి.పి, ఎముక ఖనిజ సాంద్రత, బాడీ కంపోజిషన్ వంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం డాక్టర్. న్యూట్రి షనిస్ట్ నివేదికలను పరిశీలించి, ఆహారపు అలవా ట్లు, జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పుల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కోఆర్డినేటర్లు సరోజిని, జయలక్ష్మి, న్యూట్రిషనిస్ట్ లు డాక్టర్ రాధిక, మాధురి, క్రాంతి, జీఎన్ఎం భాగ్యలత, సౌత్ ఇండియా షాపిం గ్ మాల్ రీజనల్ మేనేజర్ నవీన్, లీ ఫార్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *