విజయవాడ: ఫిబ్రవరి 19 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేరళ రాష్ట్రం ప్రభుత్వం అదనంగా రైతులకు 630 రూపాయలు బోనస్ ఇస్తు న్నా, బోనస్ ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పంపిన జీఓ ఉపసంహరిం చాలని మాజీమంత్రి, ఎస్ కెఎం రాష్ట్ర కన్వనర్ వడ్డే శోభనాధీశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా నగరంలోని గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వడ్డే మాట్లాడుతూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం వరి, గోధమ ధాన్యాలకు బోనస్ ఇవ్వ రాదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీకీ లేఖ రాయటాన్ని ఖండించారు. గత కొంతకాలంగా కనీస మద్ధతు ధరకోసం కేంద్ర ప్రభుత్వం పై రైతు సంఘా లు చేస్తున్న ఆందోళన తెలియదా అని ప్రశ్నించా రు. కనీస మద్ధతు ధర అన్ని పంటల కు రైతులకు ఇవ్వలిసిన కేంద్రప్రభుత్వం కేరళ రాష్ట్రం ఇస్తుంటే, కేంద్రం అడ్ఢుపడటం రాజకీ య కక్ష పూరితమైన చర్య కాక మరేమనుకొవాలని కేంద్రంపై విరుచుపడ్డారు. కేంద్రం కేరళకు ఇవ్వవల సిన రూ.1300 కోట్లు రీయబంర్స్ మెంట్ రాష్ట్రా నికి ఏందుకు ఇవ్వటం లేదని నిలదీశారు. రాష్ట్ర లకు ఇవ్వవలసిన జిఎస్ టి పన్నులో 60% తక్షణ మే రాష్ట్రాలకి ఇవ్వవలసిం దిగా కేంద్రాన్ని కోరారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ కష్టంగా మారు తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపి రాష్ట్ర సంఘాలు రాష్ట్ర సీనియర్ నాయకులు వై. కేశవరావు మాట్లాడుతూ మన వ్యవ సాయానికి అనుబంధంగా ఉండే పాడి, ఫౌల్టీరంగం, పశుసంవర్ధక, మత్స్య శాఖ తదితర రంగాల రైతాంగాన్నికి నష్టదాయ కమైన భారత, ఆమెరికా ఉచిత వాణిజ్య ఒప్పందం పై సంతకాన్ని చేయవద్దని కేంద్రాన్నికి హితవుపలికా రు. మన పంటలకేమో సుంకాలు ఆమెరికా విధిం చటం, వారి పంటలేమో ఉచితం గా కొనుగోలు చేయటం ఏపాటి ఒప్పంద మని కేంద్రంపై మండిపడ్డా రు. ఏపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ మాట్లాడు తూ ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చంనాయు డుని, ప్రతిపక్ష నాయకుడ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తామని చెప్పా రు. మార్చి 9 లోపు దేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సమావేశాలు జరిపి, తీర్మానాలు చేసి పంపాల ని ఆయన అన్ని రైతు సంఘాల నాయకుల ను కోరారు. తొలుత రాష్ట్రం లోని అన్ని రైతు సంఘాల సమావేశం మాజీ వ్యవసా య శాఖ మంత్రి వడ్డే శోధనాధీశ్వర రావు అధ్యక్షుతన జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో ఏపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందర్రావు, ఏఐకెఎయంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట ఆంజనేయులు, ఏఐకెయంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారా యణ, నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహన్, ఏఐకెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి, ఏఐఎస్ కెఎస్ కేంద్ర నాయకులు జానకీ రాములు, కిసాన్ సంఘట న్ రాష్ట్ర నాయకులు మరీదు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
