బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఘాటు స్పందన.. 10% అదనపు టారిఫ్‌ల ప్రకటన

సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఘాటు స్పందన.. 10% అదనపు టారిఫ్‌ల ప్రకటన

నేటి తెలుగు పత్రిక: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టారిఫ్‌లను రద్దు చేసిన నిర్ణయం దేశానికి అవమానకరమని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు తనను తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపారు.టారిఫ్‌ల విషయంలో తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేసిన ట్రంప్‌, ప్రపంచ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్‌లు విధిస్తానని ప్రకటించారు. తాత్కాలికంగా 150 రోజులపాటు ఈ అదనపు సుంకాలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ వ్యవధిలో కొత్త చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తానని వెల్లడించారు.

భారత్‌పై ప్రభావం?

భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో మార్పు ఉండదని ట్రంప్ పేర్కొన్నారు. అయితే భారత్‌ 18 శాతం సుంకాలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. అదనపు 10 శాతం గ్లోబల్ టారిఫ్ అమలైతే, ఐదు నెలలపాటు భారత్‌ ఎగుమతులపై మొత్తం 28 శాతం సుంకం పడే పరిస్థితి ఏర్పడుతుందని అంచనా.

సుప్రీంకోర్టు వర్సెస్ అధ్యక్షుడు?

ఇటీవల యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ ట్రంప్ విధించిన పలు సుంకాలను చట్టవిరుద్ధమని తేల్చిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ “సెక్షన్ 122” సహా ఇతర చట్టపరమైన నిబంధనలను ప్రస్తావిస్తూ, అధ్యక్షుడిగా టారిఫ్‌లు పెంచే అధికారం తనకుందని వాదిస్తున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

దీంతో అమెరికాలో న్యాయవ్యవస్థ-అధ్యక్షుడి మధ్య అధికార పోరు ప్రారంభమైనట్టుగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఉత్కంఠను రేపుతున్నాయి. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.