Breaking News

కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ‘కేరళ’ ఇకపై ‘కేరళం’

నేటి తెలుగు పత్రిక: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాది రాష్ట్రం అయిన కేరళ అధికారిక పేరును “కేరళం”గా మార్చేందుకు ఆమోదం తెలిపింది. భాషా ఆధారంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే “కేరళం” అనే పేరుకు గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ నిర్ణయం రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఫిబ్రవరి 24, 2026న ప్రధానమంత్రి కార్యాలయం (PMO) కొత్త భవనం ‘సేవా తీర్థ’లో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. రాష్ట్ర పేరును అధికారికంగా “కేరళం”గా మార్చాలని కోరుతూ 2024 జూన్ 24న కేరళ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించిన సాంకేతిక మార్పుల తర్వాత ఆ తీర్మానాన్ని మరోసారి ఆమోదించి కేంద్రానికి పంపారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఇప్పటికే కేరళ అసెంబ్లీ ఆగస్టు 2023లో కూడా ఇదే అంశంపై ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. రాష్ట్ర సాంస్కృతిక, భాషా గుర్తింపుతో అనుసంధానమైన “కేరళం” అనే పేరుకు రాజ్యాంగబద్ధ గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్రాన్ని కోరారు. ఇదే డిమాండ్‌కు మద్దతుగా భారతీయ జనతా పార్టీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా ప్రధానమంత్రికి లేఖ రాసి అభ్యర్థించారు. ఈ నిర్ణయం అమలులోకి రావాలంటే రాజ్యాంగ సవరణ ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంటుంది. అధికారిక ప్రక్రియ పూర్తైన తర్వాత రాష్ట్రం అన్ని అధికారిక పత్రాల్లో “కేరళం”గా నమోదు కానుంది.

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *