బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

పీఎం కిసాన్‌పై కేంద్రం క్లారిటీ.. రైతుల ఖాతాల్లోకి రూ.2 వేల జమ ఎప్పుడంటే?

పీఎం కిసాన్‌పై కేంద్రం క్లారిటీ.. రైతుల ఖాతాల్లోకి రూ.2 వేల జమ ఎప్పుడంటే?

మార్చి 8, నేటి తెలుగు పత్రిక: రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం కింద ఇచ్చే తదుపరి విడత నిధులు రైతుల ఖాతాల్లోకి మార్చి నెలాఖరులోపు జమ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మార్చిలోనే 22వ విడత నిధులు

పీఎం కిసాన్ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.6,000ను మూడు విడతలుగా ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి విడతలో రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పుడు 22వ విడత కింద రూ.2,000 రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి.సాధారణంగా ఈ విడత నిధులు ఫిబ్రవరిలో విడుదల అవుతాయి. అయితే ఈసారి లబ్ధిదారుల పునఃపరిశీలన (re-verification) ప్రక్రియ కొనసాగుతున్నందున ఆలస్యం జరిగింది. దీంతో మార్చి చివరి నాటికి నిధులు జమ చేసే అవకాశముందని తెలుస్తోంది.

అనర్హుల తొలగింపు

కొంతమంది అర్హత లేకపోయినా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక రీవెరిఫికేషన్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో అనర్హులుగా తేలిన వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు.
దీంతో నిజమైన రైతులకు మాత్రమే నిధులు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ-కేవైసీ తప్పనిసరి

పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే రైతులు e-KYC పూర్తి చేయడం తప్పనిసరి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ
  • అధికారిక వెబ్‌సైట్‌లో ఆధార్ నంబర్, OTP ద్వారా e-KYC చేయవచ్చు.
  • లేదా సీఎస్‌పీ కేంద్రాలు, బ్యాంకులు ద్వారా కూడా పూర్తి చేయొచ్చు.
  • బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.

ఫార్మర్ ఐడీ కూడా అవసరం

కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ వ్యవస్థను ప్రారంభించింది. ఇందులో నమోదు చేసుకున్న రైతులకు ప్రత్యేక యూనిక్ ఐడీ ఇస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందడానికి ఈ ఐడీ ఉపయోగపడుతుంది.

ఈ రిజిస్ట్రీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో అమల్లో ఉంది. మొత్తంగా చూస్తే, రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పీఎం కిసాన్ 22వ విడత నిధులు మార్చి చివర్లో రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం.