బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు

అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు

అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు

హైదరాబాద్, డిసెంబర్ 13, 2024:
అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై మంత్రి హరీష్ రావు తన అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అసలు బాధ్యులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన వారు, ముందు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించిన వారే ఈ దుస్థితికి కారకులని పేర్కొన్నారు.

“సినిమా కోసం థియేటర్‌కు వెళ్లిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. దీనికి అసలు కారణం రాష్ట్ర పాలకులే. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే,” అని హరీష్ రావు అన్నారు.

అదేవిధంగా, గతంలో చోటుచేసుకున్న మరికొన్ని ఘటనలను ప్రస్తావిస్తూ, “సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి, రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యలు చేశారు. ఆత్మహత్యలకు కారణమైన రేవంత్ రెడ్డి బ్రదర్స్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు?” అని ప్రశ్నించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

“రైతులను బలిగొన్న పాలనను నిలదీయాలి. చట్టం అల్లు అర్జున్ విషయంలో మాత్రమే కాకుండా, రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ సమానంగా పని చేయాలి. చట్టం ఎవరికీ చుట్టం కాకూడదు,” అని హరీష్ రావు స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారి తీస్తున్నాయి.