బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
అంతర్జాతీయం

‘గేమ్ ఛేంజర్’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం..

‘గేమ్ ఛేంజర్’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం..

అమెరికాలో ‘గేమ్ ఛేంజర్’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. అభిమాని స్కై డైవ్ చేస్తూ పోస్టర్ ప్రదర్శన

హైదరాబాద్, డిసెంబర్ 14:

మెగా స్టార్ రామ్ చరణ్, ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అమెరికాలో టికెట్ బుకింగ్స్ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి.

అమెరికాలో టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యే సందర్భంగా ఓ అభిమాని, రామ్ చరణ్‌పై తన అభిమానాన్ని ప్రదర్శించడానికి స్కై డైవ్ చేసి ‘నేటి నుంచే టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని’ రాసిన పోస్టర్‌ను ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ప్రదర్శించాడు. ఈ వీడియోను ‘గేమ్ ఛేంజర్’ టీమ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అది వైరల్ అవుతోంది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

ఇదిలా ఉంటే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా అమెరికాలో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 21న డల్లాస్‌లోని కర్టిస్ కాల్వెల్ సెంటర్లో ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు సుకుమార్ హాజరవుతారని చెప్పింది.

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

బాలీవుడ్ నటి కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్. జె. సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.