Breaking News

₹351 కోట్లతో ఆలయ విస్తరణ పనులకు భూమిపూజ

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: పవిత్ర శ్రీ రామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం అభివృద్ధికి భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు.రేవంత్ రెడ్డి రూ.351 కోట్లతో ఆలయ విస్తరణ తొలి దశ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆలయ మౌలిక సదుపాయాలు విస్తరించడంతో పాటు భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు చేయనున్నారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకాటి శ్రీహరి మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత భద్రాచలం తీర్థక్షేత్రంగా మరింత ప్రాధాన్యం పొందడమే కాకుండా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *