బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు.. 2 లక్షల మందికి చేయూత – రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు.. 2 లక్షల మందికి చేయూత – రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల చేయూత పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి ఈ విషయాన్ని వెల్లడిస్తూ, కొత్త పెన్షన్ల కోసం ఇప్పటికే నిధులు కేటాయించినట్లు తెలిపారు. జూన్ 2 నుంచి ఈ పింఛన్ల పంపిణీ ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

ప్రస్తుతం పరిస్థితి

రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షలకుపైగా మంది వివిధ వర్గాల్లో చేయూత పింఛన్లు పొందుతున్నారు.

  • వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు: రూ. 2,016
  • దివ్యాంగులు: రూ. 4,016

భారీగా దరఖాస్తులు

కొత్త పింఛన్ల కోసం సుమారు 12 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • వృద్ధాప్య పింఛన్: 4 లక్షలు
  • వితంతు/ఒంటరి మహిళలు: 3.5 లక్షలు
  • గీత, చేనేత కార్మికులు: 3 లక్షలు
  • దివ్యాంగులు: 72 వేల దరఖాస్తులు

ఎంపిక ప్రక్రియ

ఈ దరఖాస్తుల్లో అర్హులైన 2 లక్షల మందిని ఎంపిక చేయడం పెద్ద సవాల్‌గా మారింది. జిల్లా స్థాయిలో కఠిన వడపోత జరుగుతోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సమీక్ష కొనసాగిస్తున్నాయి.