- దేశమంతా అంగీకరించిన అమరావతిపై జగన్ ముఠా విష ప్రచారం.
- రాష్ట్రాభివృద్ధికి, రాయలసీమ అభివృద్ది జగన్ అడ్డంకి.
- ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
మంగళగిరి, ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: అమరావతే రాజధానిగా ప్రపంచమంతా స్వాగతిస్తుంటే… దేశంలోని అన్ని పార్టీలు అమరావతి చట్టానికి పార్లమెంట్ లో మద్దతు తెలిపితే జగన్ మాత్రం వ్యతిరేకిస్తున్నారని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2024లో జగన్ రెడ్డిని ప్రజలు ఓడగొట్టినా ఇంకా సైకో లక్షణాలు పోలేదు. రాష్ట్రంపై నిత్యం విషం చిమ్మడమే వైసీపీ, సాక్షి పనిగా పెట్టుకున్నాయి. రాజధానిపై సాక్షిలో జగన్ రెడ్డే ప్రశ్నలు వేసుకొని జగన్ రెడ్డే సమాధానాలు చెప్పుకుంటున్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలన మభ్యపెట్టి… ఐదేళ్ల పాలనలో నరకం చూపించారు. ఇప్పుడు ప్రజా రాజధానికి దేశంలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపితే జగన్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ నుంచి పారియపోయారు. రాష్ట్రాభివృద్ధిపై వీళ్లు చిత్తశుద్ధి ఏంటో అర్థమైపోయింది.
రాయలసీమ ద్రోహి జగన్… సీమ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం:
రాయలసీమ బిడ్డగా ఆ ప్రాంతానికి న్యాయం చేయాలన్న తపనతో సీమకు నీళ్లిస్తే బంగారం పండిస్తారు అన్న సిద్ధాంతంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాలన సాగిస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు రావాలని విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ మోహన్ రెడ్డి పారిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించింది. రూ.12 లక్షల కోట్ల బడ్జెట్‌లో కనీసం రూ.2 వేల కోట్లు కూడా సీమ ప్రాజెక్టులకు ఖర్చు చేయని జగన్, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నాడు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల కాలంలోనే రూ. 8,000 కోట్లు ఖర్చు చేసి రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంది. 738 కి.మీ. దూరంలో ఉన్న కుప్పానికి రూ. 3,870 కోట్లు ఖర్చు చేసి హంద్రీనీవా నీటిని అందించిన ఘనత చంద్రబాబుది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.203 కోట్లు కేటాయించడమే కాకుండా, అవుకు రిజర్వాయర్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించాం. పులివెందులకు నీళ్లు తెచ్చిన చరిత్ర కూడా చంద్రబాబు గారిదే.
జగన్ ఇసుక దోపిడీకి 39 మంది ప్రాణాలు బలి:
జగన్ పాలనలో నిర్వహణ లోపం వల్ల, ఇసుక దోపిడీకి అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి 39 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. జీఓ 365 ద్వారా 102 సాగునీటి ప్రాజెక్టుల పనులను రద్దు చేసి రాయలసీమకు జగన్ తీరని అన్యాయం చేశాడు. డ్యాముల మరమ్మతులకు కూడా రూపాయి ఇవ్వలేదు. రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయాడు. ప్రభుత్వ వేధింపుల వల్ల అల్ట్రాటెక్ వంటి పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చి, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నాం. తద్వారా సీమ యువతకు లక్షలాది ఉద్యోగాలు లభించబోతున్నాయి. ల్యాంకో సిమెంట్స్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. కర్నూలు ఎయిర్‌పోర్ట్ కట్టింది, ఓర్వకల్లును అభివృద్ధి చేసింది మేమైతే.. ఏ సంబంధం లేని తన తండ్రి విగ్రహాలను అక్కడ పెట్టుకోవడం జగన్ నైజం. రాయలసీమ అభివృద్ధి, సంక్షేమం కేవలం చంద్రబాబు గారి నాయకత్వంలోనే సాధ్యమని సీమ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పినా జగన్ తీరు మారలేదు.
