Breaking News

బలిజ కాపుల పోరుదీక్ష తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది..!

కాపు జె.ఏ.సి అధ్యక్షులు చందు జనార్ధన్

ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

విజయవాడ: ఏప్రిల్ 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక: ఆదివారం తలపెట్టిన కాపు కార్పొరేషన్ నిధులకై బలిజ కాపుల పోరు దీక్ష తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో రాయల సేన కార్యనిర్వహకులు పోరు మామిళ్ల ఈశ్వర్ ఆధ్వర్యంలో కాపు జే ఏ సి రాష్ట్రా అధ్యక్షులు చందు జనార్దన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ మేరకు చందు జనార్ధన్ మాట్లాడుతూ కొంత మంది కాపు పెద్దలు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని త్వరలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుని కలిసి తమ జాతి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని సమ ర్పిస్తామన్నారు. ఒకవేళ మా సమస్యల పట్ల స్పందించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతా మని కాపు పెద్దల పట్ల గౌరవంతో దీక్షను వాయిదా వేశామని తెలిపారు. కాపు కార్పొరేషన్కు ప్రభుత్వం ప్రకటించిన విధంగా నిధులు కేటా యించాలని కాపు కార్పొరేషన్ పేరును తక్షణమే బలిజ తెలగ కాపు కార్పొరేషన్ గా మార్చాలనీ బలిజ కాపు జాతి ఐకాన్ అయినా శ్రీకృష్ణదేవరాయులు వారి జయంతి, పట్టాభిషేకం వర్ధంతులను ప్రభుత్వం గుర్తించి అధికారికంగా ప్రకటించాలి. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన వారిలో కాపుల శాతం కూడా ఎక్కువగా ఉందని శ్రీకృష్ణ దేవరాయులు స్మారకస్మృతి వనంకు 20 ఎకరాల భూమి కేటాయించాలని అని అన్నారు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలి. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న చరిత్ర కందని మా పూర్వీకులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల తిరుమలరావు, బీసీ కార్పొరేషన్ నాయకురాలు గంగాపురం పద్మ, వి.అనిత, సామ్రాజ్యం, ఎన్.అశోక్, టి. వి.సుబ్బ య్య, అల్లం రాజేష్, వేల్పూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

క్రీస్తు ప్రేమ, శాంతి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *