బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మావిగన్‌ వివాదంపై రాజకీయ వేడి.. జగన్‌పై పట్టాభిరామ్ విమర్శలు

మావిగన్‌ వివాదంపై రాజకీయ వేడి.. జగన్‌పై పట్టాభిరామ్ విమర్శలు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: అమరావతి అభివృద్ధి అంశంపై మరోసారి రాజకీయ వాగ్వాదం చెలరేగింది. ‘మావిగన్’ ప్రతిపాదనతో మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్.2015లోనే సీఆర్డీఏ ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన గుర్తుచేశారు. సీఆర్డీఏ పరిధి మ్యాప్‌ను పరిశీలిస్తే అప్పటి ప్రభుత్వ విజన్ స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు.అమరావతిపై అసంతృప్తితోనే జగన్ కొత్త ప్రతిపాదనలు తీసుకువస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానుల అంశంలో వెనక్కి తగ్గిన తరువాత ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో కొత్త రాజకీయ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు.బిల్లుకు, తీర్మానానికి మధ్య తేడా తెలియక ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని చట్టబద్ధంగా నిలిచిందని, పార్లమెంట్ ఆమోదంతో అది స్పష్టమైందని తెలిపారు.రాష్ట్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్