Breaking News

కార్మికు ఉద్యమ నాయకుడు బి టి ఆర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్దాం

కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం.

సిఐటియు జిల్లా అధ్యక్షులు కోటగిరి

టిమ్స్ ఆస్పత్రులు రెడీ.. విదేశీ రోగులకు ప్రత్యేక సేవలు!

కోదాడ, ఏప్రిల్ 6(నేటి తెలుగు పత్రిక): భారత కార్మిక ఉద్యమ నిర్మాత భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రజాలా బ్రిటిష్ వాళ్లకు కు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కామ్రేడ్ బిటి రణదీవే ఆశయాలను సాధించడానికి ప్రతి కార్మికుడు ముందుకు రావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోటగిరి వెంకటనారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు.స్థానిక కోదాడ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో బీటీ రణదీవే 36వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీటీ రుణదీవే (బాలచంద్ర త్ర యంబు క రణదీవే) 1904 డిసెంబర్ 19న మహారాష్ట్రలోని బొంబాయిలో జన్మించిన విద్యార్థి ఉద్యమంలో పాల్గొంటూ కార్మిక సంఘ నాయకత్వంలో పనిచేస్తూ బ్రిటిష్ కాలంలోనే బొంబాయిలో కార్మిక సంఘాలు స్థాపించి అనేక పోరాటాలకు నాయకత్వ వహించారని వారన్నారు. భారతదేశంలో మొట్టమొదటి అఖిలభారత ట్రేడ్ యూనియన్ జాతీయ నాయకుడిగా , 1970లో (సిఐటియు ) ఏర్పడిన నాటినుండి 1991 వరకు సిఐటియు అధ్యక్షుడిగా పనిచేశారని వారన్నారు. వారికి కార్మికుల ప్రయోజనాలు తప్ప సొంత జీవితం పట్ల ఆసక్తి లేని నిస్వార్థ నేత బి టి ఆర్, తన తండ్రి అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా కార్మిక పోరాటంలో ఉన్న తీరు కార్మిక వర్గానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనమని వారన్నారు. 1940లో కార్మిక ఉద్యమాల్లో భాగంగా అరెస్టు చేసి జైల్లో ఉంచిన సందర్భంగా అక్కడ కూడా ఖైదీలను ఐక్యం చేసి వారి సమస్యలపై పోరాటాలు నిర్వహించారని, వారికి జైల్లోనే రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు.

తన జీవితం కార్మిక వర్గ ఐక్యత కోసం కృషి చేశారని రాజకీయంగా విభేదాలు ఉన్న కార్మిక వర్గం ఐక్యంగా ఉండాలని ప్రయత్నం చేశారని, మొరార్జీ ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానాల బిల్లుకు వ్యతిరేకంగా కార్మికులను ఉద్యోగులను ఐక్యంగా కదిలించి కార్మిక సంఘాల జాతీయ ఉద్యమ కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమాలకు ఊపిరి పోసిన వ్యక్తి వారిని వారు అన్నారు. ఆనాడు ఎన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలు హక్కులు నేటి పాలకుల విధానాల వల్ల కాలరాయపడుతున్నాయని ప్రజలపై మరిన్ని బారాలు పెరుగుతున్నాయని ఒకపక్క కార్పొరేట్ల ఆస్తులు ఇబడి ము బడిగా పెరిగిపోతుంటే మరోపక్క ఆకలి పేదరికం ఆకలి చావులు రైతాంగ ఆత్మహత్యలు నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విశాల ఐక్య కార్మికోజమాని నిర్మించడమే భేటీ రణదీవే కి మనం అర్పించే నిజమైన నివాళుని ఆ దిశగా కృషిని కొనసాగిద్దామని వారన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సిఐటియు కోదాడ పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు శరభంద రెడ్డి సిద్దెల రాంబాబు బి శ్రీనివాస్ వెంకన్న సత్తిరెడ్డి వీరబాబు నాగరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి 35 కిమీకి ట్రామా సెంటర్‌.. ప్రమాదాలపై తెలంగాణ భారీ ప్లాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *