బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతికి రాజముద్ర.. ఆంధ్రుల కల నెరవేర్చిన చారిత్రాత్మక నిర్ణయం

అమరావతికి రాజముద్ర.. ఆంధ్రుల కల నెరవేర్చిన చారిత్రాత్మక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం

చంద్రబాబు విజన్, రైతుల త్యాగానికి దక్కిన విజయం

చంద్రబాబు అంటేనే ఒక ‘బ్రాండ్’

మావిగన్ అంటూ… జగన్ మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదం

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

జగన్ రెడ్డి త్వరలోనే జీరో రెడ్డి కావడం ఖాయం

విలేకరుల సమావేశంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని)

విజయవాడ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని స్థాపన కేవలం రాజకీయ నిర్ణయం కాదని, వేలాది మంది రైతుల త్యాగ ఫలితమని ఆయన అన్నారు. 2014లో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి చరిత్ర సృష్టించారని, అదే అమరావతిని నిలబెట్టిందని పేర్కొన్నారు.మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విజన్ వల్లే అమరావతి సాధ్యమైందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.ఇక వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ, మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. అమరావతి అంశంపై ఇప్పటికీ వ్యతిరేక ధోరణి కొనసాగించడం దురదృష్టకరమన్నారు.రాజధాని గెజిట్‌తో రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల విస్తరణ వేగవంతం అవుతాయని అభిప్రాయపడ్డారు.అదే సమయంలో విజయవాడ, గుంటూరు నగరాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.అమరావతి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చే ఘట్టమని, ఇది ఆంధ్రుల దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చిన సందర్భమని ఎంపీ చిన్ని పేర్కొన్నారు.