బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగింపు

కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగింపు
  • మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగించడం జ‌రిగింద‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్ల‌డించారు. ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి కందులు (రెడ్ గ్రామ్/తూర్) కొనుగోలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించడం రైతులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయం అని అన్నారు. రాష్ట్రంలో ధర మద్దతు పథకం (PSS) కింద కొనుగోలు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. కొనుగోలు గడువును పొడిగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తిని ప‌రిశీలించిన‌ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, మే 4 వరకు పొడిగింపునకు ఆమోదం తెలిపిందన్నారు. రైతులు తమ పంటను నష్టపోకుండా విక్రయించుకునేలా చూడటం కూట‌మి ప్రభుత్వ బాధ్యత. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు అని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. పంటల కొనుగోలు, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వంటి అన్ని అంశాల్లో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగిస్తాము అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్